News

పోస్టుమార్టం సీన్లు చూసి కసితీరా చంపాడు.. ఇంతకీ నవీన్‌ ఫోన్ ఏమైనట్లు..? వెలుగులోకి సంచలన విషయాలు.. | Naveen Murder Case Update: Police investigation underway in Harihara Krishna 3rd day custody


నవీన్‌ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. తాజాగా.. నవీన్‌ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. హరిహరకృష్ణ నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.

నవీన్‌ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. తాజాగా.. నవీన్‌ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. హరిహరకృష్ణ నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. క్రైమ్ సినిమాలు, యూట్యూబ్‌ వీడియోలు చూసి..నవీన్‌ హత్యకు ప్లాన్‌ చేశాడు హరిహరకృష్ణ. డెడ్‌బాడీలోని పార్ట్స్‌ను వేరు చేసే వీడియోలు, పోస్ట్‌మార్టం దృశ్యాలను యూ ట్యూబ్‌లో పదేపదే చూసినట్టు నిందితుడు హరిహరకృష్ణ తెలిపాడు. ముఖ్యంగా పోస్ట్‌మార్టం దృశ్యాలను పదేపదే చూసి ఈ హత్యకు ప్లాన్ చేశాడని తేలింది.

నవీన్‌ హత్యకు సంబంధించి హరిహరకృష్ణతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు పోలీసులు. నిందితుడి అక్క, బావతో పాటు అతని స్నేహితుడు హసన్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఐతే నవీన్‌ మొబైల్‌ ఫోన్ మాత్రం ఇంకా లభించలేదు. దీంతో పోలీసులకు సవాల్‌గా మారింది వాట్సాప్ చాట్. ఆ వాట్సాప్‌ చాట్‌ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

ఇక మూడో రోజు కస్టడీలో హరిహరనుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. హత్య తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడ ఆశ్రయం పొందాడని ఆరా తీయనున్నారు.

కాగా.. వాట్సాప్ చాట్ రిట్రీవ్ అయితే.. చాలా విషయాలు బయటకు వస్తాయని పేర్కొంటున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button