News

పెట్టుబడులు పెట్టండని 200 మందిని నమ్మించాడు, చివరికీ..


Loan Scam

ఎవరైన మీకు మీ పేరుపై లోన్లు తీసుకోని ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించి తిరిగి ఇస్తామని చెబుతున్నారా. అయితే అటువంటి వారని అస్సలు నమ్మకండి. ఎందుకంటే మహారాష్ట్రలోని ఓ వ్యక్తి దాదాపు 200 మందిని బురిడి కొట్టింది 300 కోట్లు దండుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెల్వా కుమర్ నాదర్ అనే వ్యక్తి అష్ఠవినాయక్ అనే ఇన్వెస్ట్ మెంట్ కంపెనీని నడుపుతున్నాడు. అయితే ఇతను కొంతమంది పెట్టుబడుదారులకు ఫోన్ చేసి తన వద్ద పెట్టుబడి పెడితే వాళ్ల పేరు మీద లోన్ తీసుకొని.. ఆ తర్వాత వారికి ఎక్కవ మొత్తంలో డబ్బులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చాడు. మళ్లీ లోన్లు చెల్లించాల్సిన అవసరం లేదని నమ్మించాడు. అది నమ్మిన దాదాపు 200 మంది పెట్టుబడిదారుల అతని వద్ద పెట్టుబడులు పెట్టారు. కాని అతను వాళ్ల వద్ద నుంచి డబ్బులు తీసుకొని పారిపోయాడు.

యూఎస్ ఆధారిత ఇన్వెస్ట్ మెంట్ కంపెనీకి చెందిన సచిన్ పురుషోత్తం అనే ఓ బ్యాంక్ ఉద్యోగితో పాటు మరో 16 మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచిన్ పురుషోత్తం ఒక్కడే దాదాపు 36 లక్షలు మోసపోయాయని ఆరోపించారు. పోలీసు విచారణలో తెలిసిందేంటంటే సెల్వా కుమార్ గత నెల ఫిబ్రవరి లోనే తన కార్యాలయాలను మూసేసి తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారిని మోసం చేసి పారిపోయినట్లు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు సెల్వా కుమర్ నాదర్ ను పోలీసులు అరెస్టు చేయలేదు. అయితే తమ దర్యాప్తును కొనసాగిస్తున్నామని నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులు ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button