News

పాపం చీకోటి… ఎంతో ఆశగా, ఆర్భాటంగా వెళ్తే ఇలా చేస్తారా..?



రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పలుకుబడి.. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు పరిచయాలు.. వీటన్నింటికీ మించి క్యాసినో కింగ్‌గా పేరు సంపాదించుకున్న చీకోటి ప్రవీణ్‌కు ఘోర అవమానం జరిగింది. ఎన్నో రోజులుగా క్యాసినో ఆరోపణలతో, ఫాంహౌస్‌లో అరుదైన జంతువులను పెంచుతూ.. వార్తల్లో నిలిచిన .. సెలెబ్రిటీ రేంజ్‌ పాపులారిటీ సంపాదించారు. అలాంటిది.. ఆయన హిందుత్వవాది గానూ.. పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ.. నేడు ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.చీకోటి ప్రవీణ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. అది కూడా జాతీయ పార్టీ బీజేపీలోకి అంటే ఎలా ఉంటుంది. ఆయన స్థాయి, పలుకుబడి, పాపులారిటీకి తగ్గట్టుగానే.. నగరంలోని ముఖ్యమైన జంక్షన్ల దగ్గర పెద్ద పెద్ద ప్లెక్సీలు, హోర్డింగులు పెట్టించారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌తో కలిసి బీజేపీ ఆఫీసుకి చీకోటీ ప్రవీణ్‌ భారీ ర్యాలీ ప్లాన్ చేశారు. ఉదయం 11 గంటలకు కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్‌ ఆలయం నుంచి భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ ఎల్బీనగర్‌ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌, నల్గొండ క్రాస్‌ రోడ్స్‌, మలక్‌పేట్‌, కోఠి, అబిడ్స్‌, నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వరకు హంగూ ఆర్భాటంగా సాగింది.అయితే.. ఎంతో ఆశగా.. ధూం ధాంగా వెళ్లి.. కాషాయ కండువా కప్పుకుని క్యాసినో కింగ్ నుంచి పొలిటికల్ లీడర్‌గా మారి గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న చీకోటికి అనూహ్య పరిణామం ఎదురైంది. జాయినింగ్ విషయం పక్కన పెడితే.. ఆఫీసుకు వెళ్లిన చీకోటిని కనీసం రిసీవ్ చేసుకునేందుకు కూడా ఎవ్వరూ లేకపోవటం గమనార్హం. కిషన్ రెడ్డి కోసం చాలాసేపు చీకోటి ఆఫీసులో పడిగాపులు పడ్డారు. కానీ.. ఎంతసేపు వెయిట్ చేసినా ఎవ్వరూ రాలేదు. దీంతో.. ఆయన జాయినింగ్‌ను వాయిదా వేసుకున్నారు.ఈ పరిణామంపై చీకోటి ప్రవీణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన చేరికను అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చేరికపై కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇది జరిగిందని చీకోటి కవర్ చేసేందుకు కూడా ప్రకటించారు. అయితే.. జాతీయ స్థాయిలో బీజేపీ నేతలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చీకోటి చెప్పుకొచ్చారు. బీజేపీపై అభిమానంతోనే పార్టీలో చేరేందుకు వచ్చానని.. సీనియర్ నేతలు అందుబాటులో లేకపోవడం వల్లే చేరికకు బ్రేక్ పడిందని శ్రేణులు చెప్తున్నాయి. అయితే.. పెద్ద ఎత్తున వచ్చిన అనుచరులు మాత్రం.. ఇది కచ్చితంగా చీకోటికి ఘోర అవమానమేనని.. ఇలా వెయిట్ చేపించటం దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపం.. బీజేపీలో చేరి.. గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ఆశగా వెళ్తే ఇలా జరగటం నిజంగా బాధాకరం. చీకోటి తీవ్రంగా డిసప్పాయింట్ అయి ఉంటారు.

Related Articles

Back to top button