News

నాలుగు సార్లు హత్యాయత్నం చేసిన వ్యక్తిని అప్సర ఎలా నమ్మింది.? తెరపైకి ఎన్నో అనుమానాలు.. – Telugu News | There are many doubts in shamshabad Apsara murder case


Hyderabad News: శంషాబాద్ అప్సర హత్య కేసులో విచారణ కొనసాగుతుంది. అప్సరతో ప్రేమాయణం సాగించిన పూజారి.. పెళ్లి చేసుకోమని పట్టుబడడంతో మత్తుమాత్రలు ఇచ్చి బండతో మోది హత్య చేశాడు. శంషాబాద్ లో హత్య చేసి.. సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఇదిలా ఉంటే పూజారి సాయి…

Hyderabad News: శంషాబాద్ అప్సర హత్య కేసులో విచారణ కొనసాగుతుంది. అప్సరతో ప్రేమాయణం సాగించిన పూజారి.. పెళ్లి చేసుకోమని పట్టుబడడంతో మత్తుమాత్రలు ఇచ్చి బండతో మోది హత్య చేశాడు. శంషాబాద్ లో హత్య చేసి.. సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఇదిలా ఉంటే పూజారి సాయి కృష్ణతో పనిచేసిన పురోహితులు ఆయన మంచివాడు సాప్ట్ కార్నర్ అని చెబుతున్నారు. సాయికృష్ణ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. అసలు సాయి కృష్ణ ఇలాంటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు.? అసలు సాయి కృష్ణను అస్పర ఎలా నమ్మిందన్న అనుమానాలు వ్యక్తమవుతాయి.

ఈ క్రమంలోనే అప్సర హత్యకేసులో తెరపైకి అనేక అనుమానాలు వస్తున్నాయి. అప్సరను పూజారి సాయికృష్ణ ఎలా నమ్మించి ట్రాప్ చేశాడన్నది ప్రశ్నగా మారింది. ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి.. అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగుసార్లు తనపై హత్యాయత్నం చేసినా సాయికృష్ణను మరోసారి ఎందుకు నమ్మిందన్న వాదన వినిపిస్తోంది.

ఇక కోయంబత్తూరు అని చెప్పి అర్ధరాత్రి 2 గంటల వరకు శంషాబాద్‌లో ఉంచినా.. సాయికృష్ణను అప్సర ఎందుకు ప్రశ్నించలేదన్నది మిస్టరీగా మారింది. 3 గంటల ప్రాంతంలో గోశాల వైపు వెళ్దామంటే ఎలా నమ్మింది? పెళ్లై పాప ఉందని తెలిసినా.. సాయికృష్ణని ఎందుకు అంత గాఢంగా ప్రేమించింది? ఇలా అప్సర మర్డర్‌ కేసులో ఎన్నో అనుమానాలు నివృత్తి కావాల్సి ఉన్నాయి. ఇవన్నీ బయటపడాలంటే విచారణలో తేలాల్సిందే.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button