News

నంద్యాల: హైవేపై భారీ దోపిడీ.. రూ.1.3 కోట్ల మొబైల్స్ మాయం, నిందితులెవరో తెలిస్తే!



నంద్యాల జిల్లా డోన్‌ హైవేపై ఓబులాపురం మిట్ట సమీపంలో భారీ దోపిడీ జరిగింది. దాదాపు రూ.1.3కోట్ల విలువైన సెల్‌ఫోన్‌ కంటైనర్‌ను ఇద్దరు డ్రైవర్లు చోరీ చేశారు. ఈ నెల 11న జరిగిన ఈ చోరీ ఆలస్యంగా బయటపడింది. మొబైల్స్ లోడుతో హర్యానా నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్‌ను రోడ్డు పక్కనే ఆపిన డ్రైవర్లు.. అందులోని మొబైల్స్‌ను మరొక వాహనంలోకి మార్చేసి.. కంటైనర్‌ను అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ కంటైనర్‌ ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది.ఈ చోరీ వ్యవహారం తెలియగానే నాగాలాండ్‌కు చెందిన కంటైనర్‌ యజమాని డోన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న డోన్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చోరీ జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకునేందుకు హర్యానాకు ప్రత్యేక బృందాన్ని పంపారు. గతంలో కూడా కడప సమీపంలో మొబైల్స్, ల్యాప్‌టాప్స్ చోరీ జరిగిన సంగతి తెలిసిందే.

  • Read More And

Related Articles

Back to top button