News

తెలంగాణ విమోచనంపై రాజకీయం.. వారిని ప్రజలు క్షమించరు: అమిత్ షా



కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడారు. “తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. రజాకర్లపై పోరాడిన యోధులకు నివాళులు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు. పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైంది. నిజాంను పాలనను అంతం చేసే క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా. ఆపరేషన్‌ పోలో పేరుతో నిజాం మెడలు పటేల్‌ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించటానికి కారణాలు ఉన్నాయి. భవిష్యత్ తరాలకు నాటి పోరాట యోధులను గుర్తు చేయటం, పోరాట యోధులను సన్మానించటం కోసమే జరుపుకుంటున్నాం. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే కొందరు విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరు.” అని అమిత్ షా అన్నారు.9 ఏళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పామని అమిత్ షా అన్నారు. చంద్రయాన్ సక్సెస్, జీ20 సమ్మిట్ విజయవంతం అయిందని గుర్తుచేశారు. గతంలో చరిత్రను వక్రీకరించారని.. కాంగ్రెస్ చేసిన తప్పులను మోదీ సరిద్దారని తెలిపారు. మోదీ పుట్టినరోజు నాడు సేవా దివస్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా కాంగ్రెస్‌ వక్రీకరించిందన్నారు. భవిష్యత్‌ తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలని షా వ్యాఖ్యానించారు.

Related Articles

Back to top button