News

‘తెగింపు’ ట్విట్టర్ రివ్యూ: ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్.. అదరగొట్టేసిన అజిత్!



తమిళనాడులో స్టార్ హీరోలుగా ఉన్న విజయ్, అజిత్ కుమార్‌ల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ ఇద్దరు హీరోల అభిమానులు బహిరంగంగానే గొడవపడుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బూతుల వర్షమే. అంత పోటీ ఉన్న ఇద్దరు హీరోల సినిమాలు చాలా ఏళ్ల తరవాత సంక్రాంతికి పోటీపడుతున్నాయి. హీరోగా నటించిన ‘తునివు’, విజయ్ కథనాయకుడిగా ‘వారిసు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలూ తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి. ‘తునివు’ తెలుగులో ‘’గా నేడు విడుదలైంది. ‘వారిసు’ మాత్రం ‘వారసుడు’గా ఈనెల 14న వస్తోంది.

అయితే, తమిళనాడులో నేటి తెల్లవారుజాము నుంచే ‘తునివు’, ‘వారిసు’ సినిమాల బెనిఫిట్ షోలు మొదలైపోయాయి. ‘వారిసు’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని టాక్ వస్తోంది. అయితే, ‘తునివు’ సినిమాకు మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. అజిత్ కుమార్ తన స్వాగ్‌తో చంపేశారని అంటున్నారు. అజిత్ వన్ మ్యాన్ షో చూపించారని.. మంజు వారియర్ కూడా మంచి పాత్ర చేశారని చెబుతున్నారు. ఈ మేరకు సినిమా చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీరిలో సినీ విమర్శకులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఉన్నారు.

దర్శకుడు హెచ్ వినోద్ తన దర్శకత్వ ప్రతిభతో కట్టిపడేశారని కొందరు అంటున్నారు. ‘తునివు’ ఫస్టాఫ్ రేసీ నెరేషన్, అజిత్ స్వాగ్‌తో అద్భుతంగా ఉందని.. ఇక సెకండాఫ్‌లో బ్యాంక్‌లు చేస్తున్న మోసాన్ని ఎక్స్‌పోజ్ చేశారట. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఇచ్చే సోషల్ మెసేజ్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. బ్యాంకుల్లో సేల్స్ రిప్రజెంటేటివ్స్ చేస్తున్న మోసాల పట్ల ఈ సినిమా ద్వారా జనాల్ని ఎడ్యుకేట్ చేశారని కొంత మంది ఆడియన్స్ కొనియాడుతున్నారు. ఇక అజిత్ యాక్షన్, డైలాగులు, పాటలు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయట. అజిత్ కెరీర్‌లోని గొప్ప సినిమాల్లో ‘తునివు’ ఒకటని అంతా ప్రశంసిస్తున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. మొత్తం మీద భారీ అంచనాల నడుమ వచ్చిన ‘తునివు’ ఆ అంచనాలను అందుకోవడమే కాకుండా బ్లాక్ బస్టర్ కాబోతోంది.

ఈ సినిమాను బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. హెచ్ వినోద్ తెరకెక్కించారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు. ఇక రాధాకృష్ణ ఎంటర్‌టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంయుక్తంగా తెగింపు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రంలో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖణి ముఖ్య పాత్రలను పోషించారు.

Related Articles

Back to top button