News
తిరుమల శ్రీవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖరీదైన కానుకలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా శుక్రవారం రూ.93 లక్షలు విలువైన మూడు అంబులెన్సులను టీటీడీకి విరాళంగా అందించారు. ముందుగా అంబులెన్సులకు శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాల తాళాలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ డీజీఎం వరదరాజులు, ఆర్ఎం సత్యనారాయణ, శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీహరి, ట్రాన్స్‌పోర్టు డిఐ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.తిరుమలలో రెండు పార్కులను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్, ఈవోతిరుమల సుందరీకరణలో భాగంగా దాత వివి.రవికుమార్ సహాయంతో ఫిల్టర్ హౌస్ వద్ద, జిఎన్సీ వద్ద అభివృద్ధి చేసిన రెండు పార్కులను శుక్రవారం రాత్రి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఫిల్టర్ హౌస్ దగ్గర అన్నమయ్య సర్కిల్ పార్కును రంగురంగుల పూలమొక్కలు, పచ్చని మైదానంతో సుందరంగా రూపొందించారు. ఇక్కడి ఫౌంటెన్ లో అన్నమయ్య సంకీర్తనలు వినిపించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్కు అభివృద్ధికి రూ. 8 లక్షలు, ఐదేళ్ల పాటు నిర్వహణకు రూ.30 లక్షలను దాత అందించారు. జీఎన్సీ వద్ద రూపొందించిన పార్కులో 65 హై ఎండ్ ప్రొజెక్టెడ్ లైట్లు, శంకు చక్ర నామాలతో కూడిన ఫౌంటెన్ ఉన్నాయి. ఈ పార్కు అభివృద్ధికి రూ.15 లక్షలు, ఐదేళ్ల నిర్వహణ కోసం రూ.80 లక్షలను దాత అందించారు.ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలను పరిశీలించిన జేఈవోముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్న తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాలను టీటీడీ జేఈవో సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విభాగాల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. హాస్టల్ గదులను, మంచాలు, తాగునీటి కొళాయిలు తదితర సౌకర్యాలను పరిశీలించారు. జేఈవో వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణమ్మ, డెప్యూటీ సీఎఫ్ శ్రీనివాసులు, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుకగా లక్షకుంకుమార్చన సేవతిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజున శ్రీ కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సేవ వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనంతో ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ కామాక్షి అమ్మవారికి లక్షకుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామి, శ్రీ మనోన్మణి అమ్మవారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
- Read More And