News
తిరుమల: టీటీడీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 18న పక్కా, నెరవేరబోతున్న కల!
టీటీడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న.. చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మొత్తానిక ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ నెల 18న టీటీడీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి స్థలాల పత్రాలను అందజేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాల సమర్పణకు వచ్చినప్పుడు ఉద్యోగులుకు ఈస్థలాలు పంపిణీ చేయనున్నారుసీఎం జగన్ ఈ నెల 18, 19న తిరుమల, తిరుపతిలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతును ప్రారంభించి.. అనంతరం వర్చువల్ విధానంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అందజేసిన అనంతరం తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని తిరుమల చేరుకుంటారు. కొండపై వకుళామాత, రచన అతిథి గృహాలు ప్రారంభించి.. పద్మావతి అతిథిగృహానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని శిరోవస్త్రాన్ని ధరిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వేదాశీర్వచనం అనంతరం 2024 టీటీడీ దైనందిని, క్యాలెండర్లు ఆవిష్కరిస్తారు. రాత్రి 9 గంటలకు చిన్నశేష వాహన సేవలో పాల్గొని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 19న ఉదయం శ్రీవారిని మరోమారు దర్శించుకుని 7.35 గంటలకు ఓర్వకల్లుకు బయల్దేరి వెళ్లనున్నారు.గరుడసేవ నాడు సంతృప్తికరంగా భక్తులకు దర్శన ఏర్పాట్లుశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26వ వరకు జరుగనున్నాయని.. ఇందులో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని తెలియజేశారు. బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని, అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం, బస, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు. భద్రతాచర్యలపై ఇదివరకే సివిఎస్వో, తిరుపతి ఎస్పీ సమీక్ష నిర్వహించారని, ఇంజినీరింగ్ అధికారులు వీరికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి వాహన మండపం, మాడ వీధులు, బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, సుపథం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 తదితర ప్రాంతాలను ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
- Read More And