News
తిరుమల ఆలయం ముందు టీడీపీ జెండా కలకలం.. ఫోటో వైరల్
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. కొందరు వినూత్నంగా తన నిరసనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త ఏకంగా తిరమలలో పార్టీ జెండాతో ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. శ్రీవారి ఆలయం దగ్గర ఓ కార్యకర్త జెండా ప్రదర్శించిన ఫోటో వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఇలా జెండా ప్రదర్శించినట్లు చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీ కార్యకర్త తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా పార్టీ జెండాను ప్రదర్శించడంపై మండిపడుతున్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ కార్యకర్త ఎవరు.. జెండాను ఎప్పుడు ప్రదర్శించారన్నది క్లారిటీ లేదు. ఈ వ్యవవహారంపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించాల్సి ఉంది. తిరుమల ఆలయం దగ్గర ఇలా జెండాలు ప్రదర్శించకూడదు.. అలాగే వెంకటేశ్వరస్వామి నామస్మరణ తప్ప.. ఇంకే నినాదాలు వినిపించకూడదని చెబుతుంటారు. అయితే ఈ క్రమంలో ఏకంగా టీడీపీ జెండాను ప్రదర్శించడం కలకలంరేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Read More And