News

ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ఎంపీలతో కలిసి నారా లోకేష్ నిరసన.. రఘురామ మద్దతు



మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనకు దిగారు. ఎంపీలతో కలిసి , టీడీపీ నేతలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఏపీని రక్షించాలి అంటూ ఎంపీ నినాదాలు చేశారు.చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా పార్టీలకు అతీతంగా పార్లమెంట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా తుంగలో తొక్కారో ప్రజలకు తెలియజేయాలని.. కేవలం ఎన్నికల సమీపిస్తున్నాయని ప్రతిపక్ష నేతపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని.. ఏపీ జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేసేందుకు నిరసన చేస్తున్నామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎంపీ కేశినేని నాని. 45ఏళ్లు ఎలాంటి మచ్చలేని చంద్రబాబు చరిత్రను నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.సీమెన్స్‌ కంపెనీపై వైఎస్సార్‌సీపీ అసత్య ప్రచారం చేసిందన్నారు నారా లోకేష్. ఆధారాలు లేకుండా రెండున్నరేళ్లుగా దుష్ప్రచారం చేశారని.. సీమెన్స్‌ చేపట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. తప్పుడు ఆరోపణలతో లక్షల కుటుంబాలను, శిక్షణ పొందిన విద్యార్థుల్ని క్షోభ పెడుతున్నారన్నారు. అలాగే లోకేష్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నారా బ్రాహ్మణి కూడా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సరికాదన్నారు బ్రాహ్మణి. ప్రభుత్వం, మల్టీ నేషనల్ కంపెనీలను అపహాస్యం చేస్తోందన్నారు. పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలు అసమర్థులని.. సీమెన్స్‌ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం కళ్లు ఉండి కూడా వాటిని చూడలేకపోతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు వెంట ఉన్నారన్నారు.

  • Read More And

Related Articles

Back to top button