News

డజనులో 12 మాత్రమే ఎందుకు ఉంటాయి..? 10, 15 ఎందుకు ఉండదు.. కారణం తెలిస్తే కంగుతింటారు మరీ..!


One Dozen

డజనులో 12 మాత్రమే ఎందుకు ఉంటాయి..? 10, 15 ఎందుకు ఉండదు.. కారణం తెలిస్తే కంగుతింటారు మరీ..!
ఇప్పటి వరకు మనం డజను పరిమాణంలో చాలా వస్తువులను కొనుగోలు చేసాము. అరటిపండ్లు, కోడిగుడ్లు, స్టీలు పాత్రలు ఇలా ఎన్నో వస్తువులు డజను చొప్పున ఇస్తే అవి 12 సంఖ్యలో ఇస్తారు. అయితే డజనులో పన్నెండు అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డజను అంటే 10 వస్తువులు లేదంటే 15 వస్తువులు అని నిర్ణయించి ఉండవచ్చు కదా..? కానీ, 12 సంఖ్య ఎలా మారింది? దీనిపై పూర్తి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అవేంటో వివరణ ఇక్కడ తెలుసుకుందాం..

మనకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి, అరటిపండు, గుడ్డు ఉదాహరణగా తీసుకున్నట్టయితే,. డజను అరటిపండ్లు లేదా గుడ్లు రెండూ డజన్‌ చొప్పున లెక్కించటం చూస్తుంటాం. అయితే, దీనికి మొదటి కారణం లెక్కింపు డ్యూడెమికల్ సిస్టమ్. పురాతన కాలంలో, ప్రజలు వస్తువులను లెక్కించడానికి వేళ్లను ఉపయోగించేవారు. మీరు బొటనవేలు మినహా నాలుగు వేళ్ల మధ్య కీళ్లను లెక్కించినట్లయితే ఈ సంఖ్య 12కి వస్తుంది. అందుకే సులువుగా లెక్కించేందుకు 12వ సంఖ్యను లెక్కించడం ప్రారంభించారు.

మరొక కారణం ఏంటంటే..12 అనేది విభజించడానికి సులభమైన సంఖ్య. ఉదాహరణకు, అరటి గుత్తిని రెండు గ్రూపులుగా విభజించాలంటే, 6-6, మూడు గ్రూపులుగా విభజిస్తే, 4-4-4, నాలుగు గ్రూపులుగా విభజించినట్లయితే, 3-3-3-3ని లెక్కించవచ్చు. ఇది మరిన్ని ఎంపికలకు దారి తీస్తుంది. అలాగే డజను భాగం కావాలంటే 3 అరటిపండ్లు తీసుకోవచ్చు. కానీ 10 లేదా 15 సంఖ్య ఉంటే దాన్ని 2.5 లేదా 4.7కి మార్చడం కష్టంగా మారుతుంది. ఈ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మొదటి నుండి డజనులో 12 కు సరిచేసినట్టుగా తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Related Articles

Back to top button