News

టీం ఇండియాకు ఫీల్డింగ్‌పై అంత శ్రద్ధలేదు..రోహిత్‌ కన్నా కోహ్లీ చాలా బెటర్‌: Ajay Jadeja


దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. దీనిపై మాజీ క్రెకెటర్‌ అజయ్ జడేజా తాజాగా స్పందించాడు..

టీం ఇండియాకు ఫీల్డింగ్‌పై అంత శ్రద్ధలేదు..రోహిత్‌ కన్నా కోహ్లీ చాలా బెటర్‌: Ajay Jadeja

Jadeja’s makes bold statement about India stars

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 గ్రూప్ 2 పోరులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలో 20 ఓవర్లలో 133/9 వికెట్లకే స్కోర్‌ పరిమితమైంది. తర్వాత అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడంతో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఐతే దక్షిణాఫ్రికా అనూహ్యంగా కేవలం19.4 ఓవర్లలో తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఉత్కంఠభరితమైన ఆటలో దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా ఫీల్డింగ్ చేసిన తీరు క్రికెట్‌ అభిమానులతోపాటు, పలువురు సీనియర్‌ క్రికెటర్లను సైతం దిగ్భాంతికి గురి చేసింది. దీనిపై మాజీ క్రెకెటర్‌ అజయ్ జడేజా తాజాగా స్పందించాడు.

ఇవి కూడా చదవండి



‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తన పగ్గాలు విడచినప్పటి నుంచి టీమ్ ఇండియా ఫీల్డింగ్‌పై ఫోకస్‌ పెట్టడం మానేసిందని అన్నాడు. ఫీల్డింగ్‌కు ఏషియా టీం అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫీల్డింగ్‌కు అధిక ప్రాధాన్యతనివ్వడాన్ని నేను చివరిసారిగా చూశాను. కోహ్లీ తన టీంలోకి మంచి ఫీల్డర్లను మాత్రమే ఎంపిక చేస్తాడు. ఐతే ప్రస్తుత కెప్టెన్‌కు మాత్రం ఫీల్డింగ్‌పై అంత శ్రద్ధలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ బౌలింగ్ పరంగా ఈ ఇద్దరూ మంచి ఆటగాళ్లు. ఐతే వీళ్ల నుంచి మంచి ఫీల్డింగ్‌ను మాత్రం ఆశించకూడదు. జట్టును ఎంచుకునేటప్పుడు వారి నుంచి ఏం రాబట్టాలో కచ్చితంగా తెలుసుకోలేకపోవడంలో విఫలం అయ్యారు. టీం ఇండియా ఆటగాళ్లకు అథ్లెటిక్‌ లక్షణాలు లేవని’ అని జడేజా అన్నాడు. కాగా బుధవారం అడిలైడ్ ఓవల్‌లో జరిగే సూపర్ 12 గ్రూప్ 2లో భారత్ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button