చద్దాం అనుకున్నా చావు అంగీకరించలే.. నాటకీయ పరిస్థితుల్లో నరకంగా మిగిలిన బ్రతుకు.. | Bus Driver tries to commit suicide by jumping on railway tracks but is saved by alert people Telugu News
మరో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని వేరే ట్రాక్ పైకి వెళ్ళాడు. ట్రైను లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపేశాడు.
విశాఖలో ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. రైల్వే ట్రాక్ పైకి వెళ్లి బలవన్మరణానికి యత్నించాడు. తొలి ప్రయత్నంలో అతను చేయి తెగిపోయింది. మరో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని వేరే ట్రాక్ పైకి వెళ్ళాడు. ట్రైను లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపేశాడు. 108 సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు గుర్తించారు.
గోపాలపట్నం జనతా కాలనీకి చెందిన మురళీకృష్ణ ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా తన భార్య దూరంగా ఉంటుందని మనస్థాపనికి గురయ్యాడు మురళీకృష్ణ. దీంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాడు. మేఘాద్రి రిజర్వాయర్ సమీపంలో చనిపోదామని రైల్వే ట్రాక్ పై పడుకోవడంతో ఒక చెయ్యి తెగిపోయింది. ప్రాణాలతో ఉండడంతో మరొక ట్రైన్ కింద సూసైడ్ కు ప్రయత్నించాడు మురళీకృష్ణ. పట్టాలపై పడుకున్న వ్యక్తిని గమనించిన ట్రైన్ లోకో పైలట్ అప్రమత్తమై రైలు ఆపాడు. 108 సిబ్బందికి కాల్ చేయడంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది మురళీకృష్ణ కు ప్రాథమిక చికిత్స అందించి కేజీహెచ్ కు తరలించారు. రైలు లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో మురళీకృష్ణ మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..