News

చంద్రయాన్ 3 విజయంపై స్పందించిన యూట్యూబ్ సీఈఓ.. వీడియో విడుదల



Success: ఆగస్టు 23 సాయంత్రం 6.03 గంటలు. ఇది భారత అంతరిక్ష చరిత్రలో మరిచిపోలేని రోజు. చంద్రయాన్ 3 ప్రయోగంలోని జాబిల్లిని ముద్దాడిన క్షణం. అప్పుడు భారత్‌తో పాటు విదేశాల్లో ఎంతో మంది టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను వీక్షించారు. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ని 80 లక్షలకు పైగా యూజర్లు చూశారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్‌గా రికార్డులకెక్కింది. దీనిపై తాజాగా యూట్యూబ్ సీఈఓ స్పందించారు. చంద్రయాన్ 3 విజయంపై .. శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రయోగంతో నమోదైన ఓ రికార్డు గురించి చెప్తూ ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.03 నిమిషాలకు చంద్రయాన్‌ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి ఉపరితలంపై దిగిందని నీల్ మోహన్ వెల్లడించారు. అయితే ఆ సమయంలో ల్యాండింగ్‌ను ఇస్రో యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్‌ను ఒకేసారి 80 లక్షల మంది చూసినట్లు ఇటీవల యూట్యూబ్ ఇండియా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కొన్ని విషయాలు తమను ఎంతో మైమరపించాయని.. చంద్రుడిపై భారత్ అడుగుపెట్టినపుడు ఇస్రో ఇచ్చిన లైవ్‌ స్ట్రీమింగ్‌ను యూట్యూబ్‌లో 8 మిలియన్లు (80 లక్షలు) మంది యూజర్లు చూసినట్లు తెలిపింది. దీంతో తమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌కు స్పందించిన యూట్యూబ్‌ సీఈఓ నీల్‌ మోహన్.. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఒకేసారి 80 లక్షల మంది చూడటం అద్భుతమని.. నమ్మశక్యంగా లేదని ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ 3 జాబిల్లిపై దిగే సమయంలో ఇస్రో కంట్రోల్ రూమ్‌లో ఉన్న పరిస్థితులు, అక్కడి శాస్త్రవేత్తల ఉత్కంఠ, సంతోషం, ఆనందాలతో కూడిన ఓ వీడియోను యూట్యూబ్‌ షేర్ చేసింది. ఆ 16 సెకన్ల వీడియో క్లిప్‌లో ఇస్రో కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న టెన్షన్ వాతావరణం కనిపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్‌ 3 లోని విక్రమ్ ల్యాండర్.. దానిలో నుంచి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. జాబిల్లిపై పగలు ఉన్న 14 రోజుల పాటు పరిశోధనలు జరిపాయి. ఈ క్రమంలోనే 14 రోజుల తర్వాత చంద్రుడిపై చీకటి పడటంతో వాటిని ఇస్రో శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్‌లోకి పంపించారు. అయితే 14 రోజుల చీకటి ముగిసిన తర్వాత ల్యాండర్, రోవర్ పనిచేసే అవకాశం ఉందని ఇప్పటికే ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఈ నెల 22 న చంద్రుడిపై సూర్యోదయం కానుండగా.. ఆ రోజు ఏం జరుగుతుందోనని ఇస్రో, భారతీయులతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అవి మళ్లీ పనిచేస్తే ఇస్రో మరో అతిపెద్ద ఘనత సాధించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ల్యాండర్, రోవర్ తిరిగి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. Read More And

Related Articles

Back to top button