News

గొంతులో చనుపాలు ఇరుక్కుని పసికందు మృతి.. జీర్ణించుకోలేక తల్లి అన్నంత పని.. | Infant chokes on breast milk, dies, mom kills elder son, self in Kerala


పెళ్లైన దంపతులు పిల్లలు కావాలని కోరుకుంటారు. కాని వారు పుట్టిన కొద్ది రోజులకే చనిపోతే వారి ఆవేదన వర్ణనాతీతం.

పెళ్లైన దంపతులు పిల్లలు కావాలని కోరుకుంటారు. కాని వారు పుట్టిన కొద్ది రోజులకే చనిపోతే వారి ఆవేదన వర్ణనాతీతం. తన కుమరుడు చనిపోవడంతో తట్టుకోలేని ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కేరళలాలోని ఇడుక్కి జిల్లాకి చెందిన లిజా(38) అనే మహిళ తన కుమారుడు, భర్తతో కలిసి ఉంటోంది. ఇటీవలే ఆమె మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రోజులాగానే మంగళవారం రోజున తన కొడుకుకి ఆమె పాలిచ్చింది. అయితే ఆ పాలు గొంతులో ఇరుక్కోవడంతో ఆ పసికందు చనిపోయాడు. దీంతో లీజా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పుట్టిన 28 రోజులకే తన కుమారుడు చనిపోవడంతో లిజా తట్టుకోలేకపోయింది. దీంతో తన ఏడేళ్ల రెండో కుమారుడితో కలిసి ఆమె ఇంటి ప్రాంగణంలో ఉన్న ఓ 40 అడుగుల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొడుకు, తల్లి ఇద్దరు చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. వాస్తవానికి లిజా.. అల్కోడే సర్వీస్ కోఆపరేటీవ్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసేది. అయితే లిజాకు పుట్టిన మొదటి కొడుకు రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యల వల్ల చనిపోయాడు. ఆ తర్వాత ఆమె మానసికంగా కృంగిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో కొడుకు 28 రోజులకే చనిపోవడం తట్టులేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button