News

‘గృహలక్ష్మి’ సీరియల్ నుంచి లాస్యని తీసేశారా? అట్టెట్టా చేస్తారండీ.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోరూ!!



ఉప్పు లేని పప్పు.. మసాలా లేని చికెనూ ఎంత టేస్ట్ లెస్‌గా ఉంటాయా లాస్య లేని ‘ఇంటింటి గృ‌హలక్ష్మి’ సీరియల్ కూడా అంతే. సీరియల్ నుంచి ఆ తులసి తప్పించినా ఇబ్బంది పడరేమో కానీ.. లాస్య లేకపోతే మాత్రం ఈ సీరియల్‌‌‌లో మజానే ఉండదు. అయితే సీరియల్‌లో ఎత్తిపోతల పథకం ఎక్కువ. అంటే.. సడెన్‌గా సీరియల్ నుంచి తప్పించేస్తుంటారు. సామ్రాట్, ప్రేమ్, అభి, దివ్య, అంకిత ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సీరియల్‌ నుంచి తప్పించిన పేర్లు బొచ్చెడు ఉంటాయి. ఈ సీరియల్‌కి ప్రత్యేకించి కథ ఏమీ ఉండకపోవడంతో.. కొత్త కొత్త పాత్రల్ని తీసుకుని వచ్చి.. పాత పాత్రల్ని పంపేస్తుంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా.. తులసి, నందు, లాస్య, పరంధామయ్య, అనసూయ ఈ ఐదు పాత్రలు మాత్రం సీరియల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ కంటిర్యూ అవుతూనే ఉన్నారు. ఇప్పటికి ఈ సీరియల్ 1052 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసుకుందంటే.. తులసి పాత్ర ఎంత ప్రాధాన్యతో.. ప్రతినాయికగా ఉన్న లాస్య ప్రాధాన్యత కూడా అంతే. అయితే ఇప్పుడు ‘గృహలక్ష్మి’ సీరియల్‌లో లాస్య కనిపించడం మానేసింది. సెప్టెంబర్ 6 ఎపిసోడ్ తరువాత నుంచి ‘’ సీరియల్‌లో లాస్య కనిపించడం మానేసింది. వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్‌లో తులసి చీర అంటించడానికి ప్లాన్ చేసి.. అడ్డంగా దొరికిపోయింది లాస్య. దీంతో విక్రమ్ ఆమెను ఇంట్లో నుంచి పొమ్మని గెంటేస్తాడు. వరలక్ష్మి వ్రతం వెలిపోయి.. ఇప్పుడు వినాయక చవితి వచ్చేసింది. దాదాపు రెండు వారాలు పూర్తైంది కానీ.. సీరియల్‌లో ఇప్పటి వరకూ వరకూ లాస్య కనిపించలేదు. ఎప్పుడైతే సామ్రాట్ చనిపోయినట్టుగా చూపించారో.. ఆతరువాత కొత్త క్యారెక్టర్లను తీసుకుని వచ్చారు. ధనుంజయ్, రత్న ప్రభలు ఎంట్రీ ఇచ్చారు. సామ్రాట్ కూతురు హనీ చుట్టూ కథ నడుస్తోంది. రాజ్యలక్ష్మి, విక్రమ్, దివ్యలు ఉండనే ఉన్నారు. అయితే ఒటొచ్చీ లాస్య కనిపించడం లేదు. ఎలాగూ కొత్త పాత్రలు వచ్చాయి.. కథ నడుస్తుందని లాస్యని తప్పించేసేశారా? ఒక్క ఎపిసోడ్ రెండు ఎపిసోడ్‌లకు కనిపించడం లేదంటే అనుకోవచ్చు. కానీ ఏకంగా రెండువారాలకు పైగా కథలో భాగమైన క్యారెక్టర్‌ని తప్పించారంటే.. ఇదేదో డౌటానుమానంగానే ఉంది. ఎందుకంటే.. ఇదసలే ఎత్తుపోతల పథకం సీరియల్. ఎప్పుడు ఎవర్ని ఎత్తేస్తారో.. ఎవర్ని పట్టుకొస్తారో తెలియదు. కాబట్టి లాస్యని కూడా ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా సీరియల్ నుంచి తప్పించారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే లాస్య అలియాస్ ప్రశాంతి ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్తే.. పాప హాలిడే ట్రిప్‌కి వెళ్లినట్టుగా ఫొటోలు దర్శనం ఇస్తున్నాయి. తన లేడీ ఫ్రెండ్స్ బ్యాచ్‌తో కలిసి కాశ్మీర్ విహరిస్తుంది. అంతే కాదు.. సూపర్ క్వీన్ సీజన్ 1 విజేత అయిన ప్రశాంతి.. ఇప్పుడు సూపర్ క్వీన్ సీజన్ 2‌కి సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. అయితే సీరియల్ నుంచి బ్రేక్ తీసుకుని హాలిడే ట్రిప్‌కి వెళ్లిందా? లేదంటే సూపర్ క్వీన్ కోసమా? నిజంగానే సీరియల్ నుంచి పీకి పక్కనేట్టేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button