News

గుండెపోటుతో నటుడు సతీష్ కౌశిక్ మృతిబాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు () గుండెపోటుతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు నటుడు అనుపమ్ ఖేర్ () ట్విట్టర్‌ పోస్టులో అధికారికంగా ధృవీకరించారు. కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించిన సతీష్ (66).. నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు. ఇక దర్శకుడిగా ‘రూప్ కీ రాణి చోరోన్ కా రాజా, ప్రేమ్, హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై, తేరే నామ్, కాగజ్’ వంటి చిత్రాలను రూపొందించారు. ఇక ఆయన ‘దీవానా మస్తానా, బ్రిక్ లేన్, రామ్ లఖన్, సాజన్ చలే ససురల్, కాగజ్, ఛత్రివాలి’ తదితర చిత్రాల్లో నటించగా.. ‘మిస్టర్ ఇండియా’లో () చేసిన క్యాలెండర్ పాత్ర బాగా పాపులర్ అయింది.కాగా.. ప్రియ స్నేహితుడు సతీష్ మరణం పట్ల నటుడు అనుపమ్ ఖేర్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ‘ఈ ప్రపంచంలోని అంతిమ సత్యం మరణమే అని నాకు తెలుసు. కానీ నేను బతికుండగా.. నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ కౌశిక్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ల స్నేహానికి ఇంత సడన్‌గా ఫుల్ స్టాప్ పడుతుందనుకోలేదు!! నువ్వు లేకుండా ఈ జీవితం మునుపటిలా ఉండదు సతీష్! ఓం శాంతి!’ అని పోస్టులో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD), ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పూర్వ విద్యార్థి. అనుపమ్ ఖేర్ NSDలో అతని బ్యాచ్‌మేట్.సతీష్ మృతి పట్ల కంగనా రనౌత్, మధుర్ భండార్కర్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుస్తున్న సమాచారం మేరకు.. సతీష్ కౌశిక్ గురుగ్రామ్‌లో ఒకరిని కలిసేందుకు వెళ్తున్నప్పుడే ఆరోగ్యం క్షీణించింది. కారులోనే గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన మృతదేహం గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఉండగా, పోస్ట్‌మార్టం తర్వాత ముంబైకి తీసుకురానున్నారు.

  • Read Latest and

Related Articles

Back to top button