News

కోనసీమ: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో.. జైలుపాలైన భర్త



స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలతో యూత్ రెచ్చిపోతోంది. ప్రతి చిన్న సందర్భాన్ని అలా మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం తమ పరిధి దాటేస్తున్నారు.. పిచ్చి పనులతో చిక్కుల్లో పడిపోతున్నారు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదే జరిగింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఓ యువకుడు సభ్యసమాజం తలదించుకునే పని చేశాడు. భార్యతో తొలిరాత్రి ఏకాంతంగా గడిపిన క్షణాలను రికార్డ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డా బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫిబ్రవరి 8న.. అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహమైంది. అతడు తమ మొదటి రాత్రి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అవాక్కైన వధువు తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. యువకుడిని గత నెల 28న అరెస్టు చేశారు. అతడ్ని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. ముందు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడగా.. స్థానికంగా ఉన్న కొందరు పెద్దలు పంచాయితీలో సెటిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ బాధితురాలి తల్లి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు వధువు మైనర్ అని చెబుతున్నారు. బాలికకు పెళ్లి చేయడం నేరం.. దీంతో బాల్య వివాహంపై విచారణలో భాగంగా పోలీసులు రెండు కుటుంబాల తల్లిదండ్రులు, వివాహం చేసిన పాస్టర్‌, గ్రామ పెద్దలను అడిగి వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

  • Read Latest and

Related Articles

Back to top button