News

కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు: ఇళ్లు, రోడ్లకు బీటలు.. జనం పరుగులు! – small earthquake in kurnool district tuggali mandal


కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో సోమవారం రాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డ ప్రజలు.. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి గ్రామంలోని పలు ఇళ్లు, పలుచోట్ల సిమెంట్ రోడ్లు బీటలువారాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఉన్నతాధికారులు రాతన ప్రాంతాన్ని పరిశీలించారు.

అయితే భూకంపం రిక్టర్ స్కేల్‌పై ఎంత నమోదైంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏయే ప్రాంతాల్లో ఇళ్లు పగుళ్లు వచ్చాయి? ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై అధికారులు స్థానికులను అడిగి వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.

కాగా, గత నెల ఫిబ్రవరిలో ఏపీలోని పలు జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భూప్రకంపనలు రావడంతో ఆ జిల్లా వాసులు భయంతో వణికిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మరోవైపు, పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు రావడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button