News
ఏకంగా విమానం, రన్ వే, ఎయిర్‌పోర్టులో టీడీపీ కార్యకర్త హల్చల్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా విమానంతో పాటూ విశాఖ విమానాశ్రయంలో ఆ పార్టీ నేత () వినూత్నంగా నిరసనకు దిగారు. ముందుగా విమానంలో ప్లకార్డు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఆ తర్వాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే దగ్గర పడుకుని నిరసన తెలిపారు.సేవ్ డెమోక్రసీ నినాదం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్ కలగ చేసుకుని న్యాయం చేయాలని సేవ్ డెమోక్రసీ ఫ్లకార్డు ప్రదర్శించారు.వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.. కిషోర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిషన్ కర్షక దేవోభవ అవగాహన సదస్సులు ముగించుకుని హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో కిషోర్ విశాఖ వచ్చారు. అదే సమయంలో గవర్నర్ నజీర్ విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చే సమయం కావడంతో ఆయన కాన్వాయ్ ముందు ఫ్లకార్డు ప్రదర్శించేందుకు అతను ప్రయత్నించాడు. అందుకే కిషోర్ కుమార్ సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకు పోలీసులు వెంటనే కిషోర్ కుమార్‌నూ అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
- Read More And