News

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. టీడీపీ ఎమ్మెల్యే మళ్లీ యాక్టివ్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్



() ఎమ్మెల్యే, మాజీ మంత్రి చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయ్యారు. పార్టీకీ సంబంధించి అంశంలో మరోసారి రంగంలోకి దిగారు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.. మాజీ మంత్రి (). 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత గంటా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మినహా ఎక్కడా కనిపించలేదు.. అసెంబ్లీకి రావడం కూడా తక్కువనే చెప్పాలి. పేరుకే టీడీపీలో ఉన్నారనే చర్చ జరిగింది.. ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపించాయి.

చాలా రోజుల తర్వాత గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో మాజీ మంత్రి అయ్యన్నపాతుడ్రి () అరెస్ట్‌పై స్పందించారు. ‘సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను ఖండిస్తున్నాను. కనీస ప్రోటోకాల్స్ లేకుండా అరెస్ట్ చేసిన విధానం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను, బేషరతుగా అయ్యన్న ను విడుదల చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు. మళ్లీ గంటా ట్వీట్ చేయడంతో యాక్టివ్ అయ్యారంటూ చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లకు, ఇన్నేళ్ళకు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పారు అంటూ నెటిజన్ కామెంట్ చేశారు. అంతేకాదు గతంలో ఒకే పార్టీలో ఉన్న గంటా, అయ్యన్నపాత్రుడి మధ్య విభేదాలు ఉండేవని చర్చ జరిగింది. కానీ అయ్యన్న అరెస్టైన వెంటనే గంటా స్పందించడం ఆసక్తికరంగా మారింది.

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఇంట్లో ఆయనతో పాటూ చిన్న కుమారుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గోడ కూల్చిన వివాదంలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లని.. దీనిపై ఫిర్యాదు రావడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అయ్యన్న అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు.

Related Articles

Back to top button