News
ఈఎస్‌ఐ ఆసుపత్రిలో దారుణం.. పేషెంట్ సోదరిపై లిఫ్ట్ ఆపరేటర్ అత్యాచారం!
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పేషెంట్ సోదరిపై (మైనర్) నోట్లో గుడ్డలు కుక్కి ఆసుపత్రిలో పని చేసే ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈఎస్ఐ ఆస్పత్రి ఓపీడీలోని రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వారం రోజుల నుండి ఈఎస్ఐ ఆసుపత్రిలో బాధిత బాలిక (13) అన్నయ్య చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలో లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు.. బాలికపై కన్నేశాడు. గతరాత్రి బాలిక లిప్ట్‌లో వెళ్తుండగా.. ఆమెను అడ్డుకున్నాడు. ఆ తర్వాత పై అంతస్తుకు తీసుకెళ్ళాడు. అనంతరం నోట్లో గుడ్డలు కుక్కి యువతిపై లిఫ్ట్ ఆపరేటర్ అత్యాచారం చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న బాధిత బాలిక తనపై జరిగిన దారుణాన్ని ఆస్పత్రి సిబ్బందికి బాధితురాలు తెలియజేసింది.దీంతో అక్కడే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలు హత్యాచారానికి గురి అయిందని వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం బాధితురాలు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలకు ఈఎస్ఐ ఆసుపత్రి అడ్డాగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేషంట్ అటెండర్‌లను ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు ఆకతాయిలు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని వరసగా ఆరోపణలు వినిస్తున్నాయి. ఇలాంటి వారిపై ఆస్పత్రి యాజమాన్యం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.