News
అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోండి.. కెనడాలో ఉండే యువకుడిపై పోలీసులకు వల్లభనేని వంశీ ఫిర్యాదు
గన్నవరం ఎమ్మెల్యే పోలీసుల్ని ఆశ్రయించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతూ, వ్యక్తిగతంగా దూషిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వంశీమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడాలో ఉంటున్న పెనమలూరు నియోజవర్గానికి చెందిన యనమదల సందీప్.. తన భార్య పరువు తీసేలా సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని వాడాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నెల 6న ఎమ్మెల్యే వంశీమోహన్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే వంశీ ఫిర్యాదుతో సందీప్‌పై సెక్షన్ 153ఏ, 354ఏ1(4), 354డి, 509, 505(2), 67 ఐటీఏ 2000-2008ల కింద కేసులు నమోదు చేశారు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యనమదల సందీప్ కెనడాలో చదువుతున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి వైఎస్సార్‌కసీపీకి మద్దతు తెలిపారు. గతంలో కూడా వంశీ టీడీపీలో కొందరు తమ కుటుంబంపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
- Read More And