News

అప్పటివరకు విచారణకు వెళ్లను.. ఈడీ నోటీసులపై కవిత క్లారిటీ



ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రేపు (సెప్టెంబర్ 15) విచారణకు హాజరుకావాలని వచ్చిన నోటీసులపై.. ఎమ్మెల్సీ కవిత సెటైరికల్‌గా స్పందించారు. ఈ నోటీసులపై నిజామాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన కవిత.. నోటీసులు వచ్చిన విషయాన్ని నిర్దారించారు. అయితే.. ఆ నోటీసులు ఈడీ ఇచ్చినవి కాదని.. మోదీ పంపించిన నోటీసులుగా చెప్పుకొచ్చారు. తనకు మోదీ నోటీసు వచ్చిందని తెలిపారు. అయితే.. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే నోటీసు వచ్చినట్టు భావిస్తున్నట్టు తెలిపారు కవిత. అయితే.. ఈ నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఓ ప్రజాప్రతినిధిగా.. ఈ నోటీసును పార్టీ లీగల్‌ టీమ్‌కు పంపించామని.. వారి సలహా ప్రకారమే ముందుకెళ్తామన్నారు.అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏడాదిగా విచారణ సాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. దీన్ని ఓ టీవీ సీరియల్‌లా కొనసాగిస్తున్నారని సెటైర్ వేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. మళ్లీ ఇంకో కొత్త ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తున్నారంటూ తీసిపారేశారు. ఈ నోటీసును ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణ ఇంకెంత కాలం కొనసాగుతుందో తెలియదని… గతంలో కూడా 2జీ స్కాం విషయంలో విచారణ కూడా చాలా కాలమే సాగిందంటూ ఉదహరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ నోటీసులకు సీరియస్‌గా తీసుకోరని కవిత చెప్పుకొచ్చారు. అయితే.. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే.. తాను పలు మార్లు విచారణకు హాజరుకాగా.. మరోసారి నోటీసులు రావటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. ఈడీ విచారణకు హాజరుకావటంపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దానిపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో.. మళ్లీ నోటీసులు రావటంతో.. రేపు కవిత తరఫు న్యాయవాదులు ఢిల్లీకి పయనం కానున్నారు. సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు విచారణకు వెళ్లనంటూ కవిత డైరెక్టుగానే చెప్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఈడీ ఎలా స్పందించనుంది.. సుప్రీం ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Related Articles

Back to top button